అనంతపురం: శ్మశాన వాటికల సాధనకై పోరుబాట

10చూసినవారు
అనంతపురం: శ్మశాన వాటికల సాధనకై పోరుబాట
శ్మశాన వాటికల సమస్యల పరిష్కారం కోసం మార్చి 5 నుంచి 'జీపు యాత్ర' నిర్వహిస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి తెలిపారు. ఆదివారం అనంతపురంలో కరపత్రాలను విడుదల చేసిన ఆయన చస్తే పూడ్చుకోవడానికి స్థలం లేక పేదలు పడుతున్న ఇబ్బందులపై మండిపడ్డారు. కళ్యాణదుర్గం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర 14 నియోజకవర్గాల్లో సాగి 16న కలెక్టరేట్ వద్ద ధర్నాతో ముగుస్తుందని, దీనిని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్