అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విచారణ వేగవంతమైంది. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో తాడిపత్రీ ఏఎస్పీ రోహిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్కు పంపారు. మరికొంతమంది పోలీసుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.