ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు

12చూసినవారు
ATP: చేతివాటం ప్రదర్శించిన బేకరీల యజమానులు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా జిల్లాలోని కొందరు బేకరీ యజమానులు తూకాల్లో మోసాలకు పాల్పడ్డారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ శంకర్ తనిఖీలు నిర్వహించగా, 1 కిలో కేక్‌కు 200 గ్రాములు తక్కువగా తూకం వేస్తున్నట్లు వెలుగు చూసింది. కణేకల్, ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో తనిఖీలు చేసి కేసులు నమోదు చేశారు. కణేకల్లులో 2 షాపులకు రూ.20 వేలు, ఉరవకొండలో 4 షాపులకు రూ.41 వేలు, విడపనకల్లులో 3 షాపులకు రూ.27 వేల జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్