బ్రహ్మమసముద్రం మండలంలోని టీటీపీ ప్రాజెక్ట్ నుండి రెండు గేట్లను తెరవడంతో భారీగా నీరు ప్రవహించింది. వేపులపర్తి అగిరి వద్ద బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ నీటిలో కొట్టుకుపోయారు. గ్రామస్థులు, ఈతగాళ్లు తాడు సహాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.