అనంతపురంలోని బిందెలకాలనీలో నాగరాజు, అతని అల్లుడు గుణల మధ్య ఆధిపత్య పోరు వ్యక్తిగత ఘర్షణకు దారితీసింది. మంగళవారం బైకుపై వెళ్తున్న గుణను నాగరాజు వర్గీయులు అడ్డగించి తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో గుణ పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.