బుక్కరాయసముద్రం: నీళ్ల బకెట్ లో పడి 15 నెలల చిన్నారి మృతి

17చూసినవారు
బుక్కరాయసముద్రం: నీళ్ల బకెట్ లో పడి 15 నెలల చిన్నారి మృతి
బుక్కరాయసముద్రం పంచాయతీ వీరభద్రకాలనీలో గురువారం సాయంత్రం గ్రీష్మ (15 నెలలు) అనే చిన్నారి నీళ్ల బకెట్‌లో ప్రమాదవశాత్తు పడి మృతి చెందింది. తల్లిదండ్రులు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు వ్యాపారం కోసం బయలుదేరే సమయంలో, ఆడుకుంటున్న గ్రీష్మ బాత్రూమ్‌లోని నీళ్ల బకెట్‌లో పడి ఊపిరాడక మరణించింది. తల్లిదండ్రులు గమనించి బయటకు తీసేసరికి పాప అప్పటికే మరణించినట్లు తెలిసింది. తల్లిదండ్రుల రోదనలు హృదయవిదారకంగా మారాయి.