అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత, ధరల సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయడానికి వీలుగా కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ నంబర్ల ద్వారా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆయన సూచించారు. CCC నెం. 8500292992, 08554-220009, 1800-425-8804, 08554-234122, 08554-231722, 08554-239822 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు.