ఆదివారం అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో, కాలనీల్లో "కార్డెన్ సెర్చ్ ఆపరేషన్" నిర్వహించారు. రౌడీషీటర్లు, పాత కేసుల్లో నిందితులు, అనుమానితుల ఇళ్లల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. కళ్యాణదుర్గం, తాడిపత్రి, రాయదుర్గం పోలీసుస్టేషన్ల పరిధిలో రికార్డులు సరిగా లేని 72 బైకులు, 3 ఆటోలు, 2 కార్లు, 64 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో ఇద్దరు మట్కా బీటర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.