అనంతపురం గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగభూషణం అవినీతి కేసులో ఏసీబీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2018లో కులాంతర వివాహ ప్రోత్సాహకం కోసం అజ్మీత్ అనే వ్యక్తి నుంచి రూ. 4,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నాగభూషణానికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 2 లక్షల జరిమానా విధించింది. జరిమానాలో రూ. 1,90,000 బాధితుడికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.