భారత క్రికెటర్ నితిన్ కుమార్ అనంతపురం నగరంలోని ఆర్డీటీ స్టేడియంను సందర్శించారు. అక్కడ చిన్నారులను ఆప్యాయంగా పలకరించి, వారితో సరదాగా ఫోటోలు దిగారు. అనంతరం, ఆలూరు విరాట్ అనే బాలుడికి ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ను బహుమతిగా అందించారు. స్టార్ క్రికెటర్ తమతో సమయం గడపడం, ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్ ను అందుకోవడం పట్ల చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.