దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు స్ఫూర్తిదాయకం, ప్రశంసనీయమని జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీసు అమరవీరుల స్థూపం వద్ద ప్రత్యేకంగా జాతీయ ఏకత్వ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈసందర్భంగా సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.