పెట్రోల్, డీజిల్ కొరత పై వదంతులు నమ్మవద్దు: జాయింట్ కలెక్టర్

14చూసినవారు
పెట్రోల్, డీజిల్ కొరత పై వదంతులు నమ్మవద్దు: జాయింట్ కలెక్టర్
అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే వదంతులను ప్రజలు నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తెలిపారు. అన్ని బంకుల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని, భయాందోళనతో అవసరానికి మించి కొనుగోలు చేయడం వల్లే రద్దీ ఏర్పడుతోందని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్