పెట్రోల్, డీజిల్ కొరత పై వదంతులను నమ్మొద్దు: ఎస్పీ

7చూసినవారు
పెట్రోల్, డీజిల్ కొరత పై వదంతులను నమ్మొద్దు: ఎస్పీ
అనంతపురం జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదని ఆయన వెల్లడించారు. ఇంధన సరఫరా, విక్రయాలపై జిల్లా పోలీసు శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నదని, ఇప్పటికే అన్ని పోలీసు స్టేషన్లకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్