అనంతపురం జిల్లాలో డీజిల్ కొరత ఉందన్న వదంతులను ఎవరూ నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ స్పష్టం చేశారు. జిల్లాలో డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని ఆయన తెలిపారు. ఎవరైనా డీజిల్‌ను నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్ చేసినా, అక్రమ రవాణా లేదా కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తీసుకుని, లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎంఆర్వో, సీఎస్ఓటీలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.