అనంతపురంలోని విద్యుత్ శక్తి నగర్ లో అనంత ఫిలిం సొసైటీ వార్షికోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. అధ్యక్షులు రషీద్ భాష ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన 29 లఘు చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జ్యూరీ సభ్యులు వెంకట్ కన్నా, దుర్గాప్రసాద్ కూడా పాల్గొన్నారు.