అనంతపురంలో డొక్కా సీతమ్మ వర్ధంతికి అన్నదానం

8చూసినవారు
అనంతపురంలో డొక్కా సీతమ్మ వర్ధంతికి అన్నదానం
అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మంగళవారం డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యనిర్వహకులు విజయ సాయికుమార్ మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గొప్ప అన్నదాత అని, వచ్చిన వారికి లేదనకుండా అన్నం పెట్టేవారని కొనియాడారు. నిస్వార్థంతో, పట్టుదలతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని, డొక్కా సీతమ్మ జీవితమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్