ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ నిరుద్యోగ మహిళలకు రూడ్‌సెట్ సంస్థ కంప్యూటర్ ట్యాలీలో ఉచిత శిక్షణ ఇవ్వనుంది. మే 16 నుంచి జూన్ 22 వరకు జరిగే ఈ శిక్షణలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పించబడతాయి. 19 నుంచి 50 ఏళ్లలోపు మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రూడ్‌సెట్ డైరెక్టర్ విజయలక్ష్మి సూచించారు. ఆసక్తిగలవారు అనంతపురంలోని రూడ్‌సెట్ కార్యాలయంలో సంప్రదించవచ్చు.