రాయదుర్గం మండలంలోని ఆవులదట్ల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మంగళవారం యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి వీ. సుబ్బరాయుడు పదవ తరగతి విద్యార్థులకు మోడల్ పేపర్లను ఉచితంగా పంపిణీ చేశారు. యూటీఎఫ్ సంఘం గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం నిష్ణాతులైన ఉపాధ్యాయులతో మోడల్ పేపర్లను తయారు చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం. విజయభారతి, మురళి, రాజేష్, ప్రవీణ్ పాల్గొన్నారు.