అనంతపురం మదన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్‌లో ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల కోసం ఉచిత కంటి శిబిరం ప్రారంభమైంది. మచ్చా రామలింగారెడ్డి అధ్యక్షత వహించగా, శ్రీ మీనాక్షమ్మ ఫౌండేషన్ ప్రతినిధి రవికాంత్ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కంప్యూటర్ వాడకంతో పెరుగుతున్న కంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఉచిత కళ్లద్దాలు, ఆపరేషన్లు అందిస్తామని రవికాంత్ రమణ తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 3,000కు పైగా ఆపరేషన్లు చేశామని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని, రేపు కూడా శిబిరం కొనసాగుతుందని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని మచ్చా రామలింగారెడ్డి పిలుపునిచ్చారు. డాక్టర్ మదన్ మోహన్ రెడ్డి కూడా చికిత్సలు అందించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నాయకులు కుల్లాయి స్వామి, మల్లికార్జునలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.