అనంతపురం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని 50 డివిజన్లు, 4 పంచాయతీల్లో విజయం సాధించడమే తమ లక్ష్యమని ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్నికల సన్నద్ధతపై కార్యకర్తలకు ఎమ్మెల్యే కీలక సూచనలు చేశారు.