సూపర్ కప్ 2026 విజేత గోదావరి లెజెండ్స్

7చూసినవారు
సూపర్ కప్ 2026 విజేత గోదావరి లెజెండ్స్
అనంతపురం ఆర్డిటి స్టేడియంలో జరిగిన ఏపీ సూపర్ కప్–2026 ఫైనల్లో సిటాడెల్ గోదావరి లెజెండ్స్ ఎఫ్సీ విజయం సాధించింది. కోరమండల్ ఎఫ్సీపై పెనాల్టీ షూటౌట్ ద్వారా 3-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. గోల్కీపర్ సచిన్ ఝా అద్భుత ప్రదర్శన కనబరిచారు. విజేత జట్టుకు రూ. 10 లక్షల బహుమతి దక్కింది. క్రీడాకారులు రాజా దేబ్నాథ్, విగ్నేష్, రమేశోర్ గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కలెక్టర్ ఆనంద్ విజేతలను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్