నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ బుధవారం తెలిపారు. దీని ప్రభావంతో 24 గంటల్లో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.