సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అనంతపురం జిల్లా విడపనకల్లు గ్రామంలో వైసీపీ మద్దతుదారు మల్లికార్జున ఏకగ్రీవం కోరుతూ దండోరా వేయించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలిస్తానని ప్రకటించారు. ఈ దండోరా వీడియో వైరల్ అవడంతో ఎస్సై ఖాజాహుస్సేన్ అప్రమత్తమై, అనుమతి లేకుండా దండోరాలు వేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.