హనీ ట్రాప్ కేసులో విచారణ వేగవంతం.. పలువురు పోలీసులపై వేటు

0చూసినవారు
హనీ ట్రాప్ కేసులో విచారణ వేగవంతం.. పలువురు పోలీసులపై వేటు
అనంతపురంలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో విచారణ వేగవంతమైంది. ఎస్పీ జగదీశ్ పర్యవేక్షణలో తాడిపత్రీ ఏఎస్పీ రోహిత్ కుమార్, ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు సీఐలు, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపారు. ఈ కేసులో మరో సీఐ, మరికొంతమంది కానిస్టేబుళ్ల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. వారిపై కూడా విచారణ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్