వెయ్యి రూపాయిలు పింఛన్ పెంచేందకు జగన్ కు ఐదేళ్లు పట్టింది

1చూసినవారు
వెయ్యి రూపాయిలు పింఛన్ పెంచేందకు జగన్ కు ఐదేళ్లు పట్టింది
అనంతపురం నగరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ, వెయ్యి రూపాయల పింఛన్ పెంచడానికి జగన్ కు ఐదేళ్లు పట్టిందని, అయితే సీఎం చంద్రబాబు తొలి ఐదు సంతకాలతోనే పింఛన్ల పెంపు చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి, వారి వద్దకే వచ్చి పింఛన్లు అందజేస్తున్నారా లేదా అని ఆరా తీశారు. పింఛన్లపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేసి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్