అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకున్నారని, అయితే చంద్రబాబు సీఎం అయ్యాక పనులు నిలిపివేయడం అన్యాయమని ఆయన విమర్శించారు. సీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.