అనంతపురం: శుక్రవారం అనంతపురం ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య అర్బన్ నియోజకవర్గం కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. నూతన అధ్యక్షులుగా కేశవ్, ప్రధాన కార్యదర్శిగా ఉపేంద్ర, ఉపాధ్యక్షులుగా తిమ్మప్ప, కమిటీ సభ్యులుగా బన్సీలాల్ నాయక్ తదితరులు ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నూతన కమిటీ కృషి చేయాలని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షఫీ ఉల్లా, రేపటి రామాంజనేయులు ఆకాంక్షించారు.