అనంతపురం తపోవనంలోని శివశక్తి సాయి దేవాలయంలో గురువారం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు నాగరాజు స్వామి, కార్యనిర్వహకులు విజయ సాయి కుమార్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుక ఉదయం స్వామి వారి సుప్రభాత సేవతో ప్రారంభమైంది. అనంతరం అభిషేకం, విశ్వక్షేన ఆరాధన నిర్వహించి, ఆపై స్వామి వారి కళ్యాణాన్ని కన్నుల పండువగా జరిపించారు.