నంబుల పూలకుంటలో దిన్నెమీదపల్లెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామంలో నివాసి తిరుమలయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంటలు వ్యాపించాయి. ఇంట్లో దాచిన రూ.2.80 లక్షల నగదు, మూడు తులాల బంగారం పూర్తిగా కాలిబూడిదయ్యాయి. స్థానికులు సమాచారంతో తిరుమలయ్య ఇంటికి వచ్చారు, అప్పటికే మంటలు అంతా వ్యాపించి ఉండగా, తహసీల్దార్ దేవేందర్ నాయక్, ఎస్సై వలీ బాషా ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి అగ్నిప్రమాద కారణాలను పరిశీలిస్తున్నారు.