అనంతపురంలో గంజాయి విక్రేతలు అరెస్ట్: 14 మందిపై కేసు నమోదు

0చూసినవారు
అనంతపురంలో గంజాయి విక్రేతలు అరెస్ట్: 14 మందిపై కేసు నమోదు
అనంతపురం పట్టణంలో రెండు రోజుల పాటు జరిగిన కార్టూన్ సెర్చ్ లో భాగంగా, కీలక నిందితుడు షికారి సురేష్ తో పాటు 14 మంది గంజాయి విక్రేతలను వన్ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి ఏడు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు కింగ్ పిన్ షికారి సురేష్ కాగా, మరో ఐదుగురు పాత నేరస్తులు. మిగిలిన తొమ్మిది మంది గంజాయిని ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయించేవారు. పట్టణంలో గంజాయి టెస్టింగ్ కిట్ల ద్వారా పలువురిని పరీక్షించగా, గంజాయి సేవించినట్లు గుర్తించారు. వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ విక్రేతల ద్వారా గంజాయి వ్యాపారం గుట్టు రట్టయింది.

సంబంధిత పోస్ట్