గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మెడికల్ టెస్ట్ కిట్లు

8చూసినవారు
గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మెడికల్ టెస్ట్ కిట్లు
అనంతపురం జిల్లా వ్యాప్తంగా డ్రంకన్ డ్రైవ్ తరహాలో గంజాయి సేవించే వారిని గుర్తించేందుకు మెడికల్ టెస్ట్ కిట్లు ఉపయోగిస్తున్నామని జిల్లా ఎస్పీ పి. జగదీష్ తెలిపారు. గతంలో విద్యాసంస్థలు, కాలనీలు, గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతలో చైతన్యం తీసుకువచ్చామని, గంజాయి రవాణా, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలు శిక్షలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్