వైసీపీ అధినేత జగన్ రెడ్డి వ్యవహారశైలిని ప్రశ్నించిన పత్రికాధినేతపై దాడులు చేస్తారా అని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నాయకులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. వైసీపీ నాయకులు మొదటి నుంచి రౌడీల తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నారని, అందుకే ప్రజలు వారిని 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారని ఆయన అన్నారు. అయినప్పటికీ వారు బుద్ధి తెచ్చుకోకుండా అదే ధోరణితో ఉన్నారని విమర్శించారు.