నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి

9చూసినవారు
నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి
అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయం వద్ద నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. ఎమ్మెల్యే దగ్గుపాటిని కలిసేందుకు భారీగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. పూల బొకేలు, పూలహారాలు అందజేసి ఎమ్మెల్యేకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు, కూటమి పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, వివిధ వర్గాల వారు, ప్రజలు కూడా భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కర్నీ ఆప్యాయంగా పలుకరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే దగ్గుపాటి. గజమాలలు తీసుకొచ్చి ఎమ్మెల్యేపై అభిమానం చాటుకున్నారు నాయకులు. 'జై దగ్గుపాటి అన్న' నినాదాలతో శ్రీనగర్ కాలనీ మారుమోగింది.

ట్యాగ్స్ :