వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో రైతు సమస్యలపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దగ్గుపాటి ప్రసాద్ వివాదాలు, అవినీతి బురదలో కూరుకుపోయి, దాన్ని అందరికీ అంటించాలని చూస్తున్నారని తెలిపారు. తాను సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి ఉన్నానని, కానీ ఇంతకాలంలో ఇలాంటి వివాదాల్లో కూరుకుపోయిన వారిని చూడలేదని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.