అనంతపురం నగరంలోని 26వ డివిజన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెల్లవారుజామున ఆకస్మిక పర్యటన చేశారు. కమిషనర్ జశ్వంత్ రావుతో కలిసి రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి, నూతనంగా వేసిన రోడ్లు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతుల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. మార్నింగ్ వాకర్స్, మహిళలతో మాట్లాడి, పార్కులోని సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, నగరంలోని 28 పార్కుల్లో సమస్యలను స్పెషల్ డ్రైవ్ కింద పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.