మదర్స్ మిల్క్ బ్యాంక్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎంపీ అంబికా

7చూసినవారు
మదర్స్ మిల్క్ బ్యాంక్ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎంపీ అంబికా
అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఏర్పాటు చేసిన అనంత మదర్స్ మిల్క్ బ్యాంక్ తొలి వార్షికోత్సవ కార్యక్రమంలో ఎంపీ అంబిక, స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతపురం కరువు జిల్లా అని, పౌష్టికాహార లోపం వల్ల తల్లులు పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని ఎంపీ అన్నారు. ఇలాంటి సమయంలో మదర్స్ మిల్క్ బ్యాంక్ ఎంతో మంది శిశువులకు జీవనాధారంగా నిలుస్తోందని, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా విజయవంతంగా కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం మరింత పురోగతి సాధించాలని ఎంపీ అంబిక ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్