అనంతపురం జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీని సందర్శించిన ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ, వైస్ చాన్సలర్ సుదర్శన్ రావుతో సమావేశమయ్యారు. చివరి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులు ఐటీ, సాంకేతిక రంగాల్లో అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు అవసరమైన శిక్షణ అందించడంపై చర్చించారు. ఈ సందర్భంగా బెంగళూరులోని ప్రముఖ ఐటీ నిపుణుల బృందాన్ని వైస్ చాన్సలర్, ప్రొఫెసర్లకు ఎంపీ పరిచయం చేశారు.