
పవన్ కళ్యాణ్ అవకాశవాది: అద్దంకి దయాకర్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్‌ను అవకాశవాదిగా అభివర్ణిస్తూ, ఆయన తెలంగాణలో ఒకలా, ఆంధ్రలో మరోలా మాట్లాడుతారని ఆరోపించారు. బీజేపీతో స్నేహంగా ఉంటే ఒకలా, టీడీపీతో పొత్తులో ఉంటే మరోలా ఉంటారని విమర్శించారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి, ఆంధ్ర-తెలంగాణ మధ్య చిచ్చుపెట్టేలా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యం, అవగాహనలేమి అని దయాకర్ అన్నారు.




