అనంతపురం శిల్పారామంలో గురువారం సాయంత్రం నూతన సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద గేయాలు, నృత్య ప్రదర్శనలు వీక్షకులను విశేషంగా అలరించాయి. పరిపాలనాధికారి పి.శివ ప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఈ వేడుకల్లో సుమారు 5,000 మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. చిన్నారులు కూడా నృత్య ప్రదర్శనలు ఇచ్చి సందడి చేశారు.