అనంతపురం జిల్లాలో కొత్త బార్ పాలసీ కింద 7 బార్ల కోసం ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనంతపురంలో మూడు, గుంతకల్లులో రెండు, తాడిపత్రి, రాయదుర్గంలో ఒక్కో బార్ కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఫిబ్రవరి 4న దరఖాస్తులు స్వీకరించి, 5న లాటరీ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. దరఖాస్తు రుసుముగా రూ. 5లక్షల డీడీ చెల్లించాలని ఎక్సైజ్ అధికారి రామమోహన్ రెడ్డి తెలిపారు.