మార్చి 1 ఆదివారం సెలవు దినం కావడంతో, ఫిబ్రవరి 28న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందజేస్తామని కలెక్టర్ ఓ. ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారు. ఫిబ్రవరి నెలకు గాను జిల్లాలో 2,77,073 మంది లబ్ధిదారులకు రూ.123.99 కోట్లు విడుదలయ్యాయని, మొదటి రోజు పింఛన్ అందనివారు మార్చి 2న పొందవచ్చని ఆయన వెల్లడించారు.