తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించిన ఘనత ఎన్టీఆర్ దే

6చూసినవారు
తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించిన ఘనత ఎన్టీఆర్ దే
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అనంతపురం అర్ట్స్ కళాశాల, జెడ్పీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించిన ఘనత ఎన్టీఆర్ గారిదని, 44 ఏళ్లు పార్టీని దిగ్విజయంగా నడిపించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారిదని అన్నారు. మంత్రి నారా లోకేష్ గారు పార్టీని మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహాలకు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎమ్మెల్యే దగ్గుపాటితో పాటు వందలాది పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్