జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు, అనంతపురం రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌లలో త్రీటౌన్ & ఈగల్ టీం ఆధ్వర్యంలో పోలీసు జాగిలంతో సర్ప్రైజ్ చెకింగ్‌లు నిర్వహించారు. గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడం లక్ష్యంగా, ఇతర రాష్ట్రాలు మరియు ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు, బస్సులు, పార్సిల్ సర్వీసులపై ఈ తనిఖీలు చేపట్టారు.