అనంతపురం లో పోలీసులకు ఫైరింగ్ లో శిక్షణ

5చూసినవారు
అనంతపురం లో పోలీసులకు ఫైరింగ్ లో శిక్షణ
అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆదేశాల మేరకు, బుధవారం ఇటుకలపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నీల మైదానంలో ఏ. ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్రిజనర్స్ ఎస్కార్ట్ సిబ్బంది, గార్డు డ్యూటీ సిబ్బంది, పీఎస్వోలకు ఫైరింగ్ శిక్షణ కార్యక్రమం జరిగింది. ప్రిజనర్స్ ఎస్కార్ట్ మరియు శాంతి భద్రతల నిర్వహణలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అధునాతన ఆయుధాల వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే సామర్థ్యాలను పెంపొందించడమే ఈ శిక్షణ లక్ష్యం.

ట్యాగ్స్ :