నగరంలో శానిటేషన్ మరింత మెరుగుపడాలి: ఎమ్మెల్యే

8చూసినవారు
నగరంలో శానిటేషన్ మరింత మెరుగుపడాలి: ఎమ్మెల్యే
నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడాలని, ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని ఎమ్మెల్యే దగ్గుపాటి నూతన సూపర్వైజర్లకు, మున్సిపల్, మెప్మా అధికారులకు సూచించారు. క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతం కంటే పరిస్థితులు మెరుగైనప్పటికీ, మరింత బాగా పనిచేయాలని, బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించారు. తృప్తి క్యాంటీన్ల ఏర్పాటుపై మెప్మా అధికారులు దృష్టి సారించాలని కూడా ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్