సత్యసాయి కార్మికుల పెండింగ్ జీతాల సమస్యను తక్షణమే పరిష్కరించాలని యూనియన్ జిల్లా అధ్యక్షుడు చింతకాయల నరేష్ అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ను కోరారు. కలెక్టరేట్లో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన నరేష్, బకాయి బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, వీలైనంత త్వరగా పెండింగ్ బిల్లులు మంజూరయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.