జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు, పోలీసు అమర వీరుల వారోత్సవాల సందర్భంగా పోలీసుల త్యాగాలపై స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 3 ఏ. ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, 3 ఏ. ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేష్, పోలీసుల సేవలు, త్యాగాల ప్రాముఖ్యతను వివరించారు.