అనంతపురం లో పెట్రోల్ బంక్ లను తనిఖీ చేసిన ఎస్పీ, కలెక్టర్

2చూసినవారు
అనంతపురం లో పెట్రోల్ బంక్ లను తనిఖీ చేసిన ఎస్పీ, కలెక్టర్
అనంతపురం నగరంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న సంగమేష్ సర్కిల్ లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ ఓ. ఆనంద్, జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వినియోగదారులతో మాట్లాడిన కలెక్టర్, ఎస్పీలు పెట్రోల్ లభ్యత గురించి ఆరా తీశారు. నిన్నటి నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్ దొరుకుతోందని వినియోగదారులు తెలపగా, అవసరం మేరకు మాత్రమే పెట్రోలు, డీజిల్ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోరాదని కలెక్టర్, ఎస్పీలు సూచించారు.

ట్యాగ్స్ :