గొళ్ళ గ్రామంలోని ఎస్సీ కాలనీలో కళ్యాణదుర్గం ఎస్వీజీఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 2 పీఓ కే. శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ జీ. వెంకట నాయుడు పాల్గొని మొక్కలు నాటారు. ప్రత్యేక శిబిరంలో భాగంగా మొక్కలు నాటి, ప్రజలకు వాటి ప్రయోజనాలను వివరించినట్లు పీఓ శ్రీధర్ తెలిపారు.