సహాయ బ్రాంచి పోస్టుమాస్టర్ ఆత్మహత్యాయత్నం

1చూసినవారు
సహాయ బ్రాంచి పోస్టుమాస్టర్ ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు ఉపతపాలా కార్యాలయంలో సహాయ పోస్టుమాస్టర్‌గా పనిచేస్తున్న చందు, శుక్రవారం విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉద్యోగ బాధ్యతలు ఇబ్బందికరంగా ఉండటంతో రాజీనామా చేసి, ఇటీవల సహాయ బ్రాంచి పోస్టుమాస్టర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే, డివిజన్ ఏఎస్పీ మునుపటి పనే చేయాలని, లేదంటే ఉద్యోగం పోతుందని బెదిరించడంతో భయపడి కార్యాలయం బాత్రూంలో విషద్రావకం తాగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జీడీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు క్రిష్ణయ్య యాదవ్, అధికారుల వేధింపులే కారణమని ఆరోపించారు. డివిజన్ ఎస్పీ అమరనాథ్ సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు.
Job Suitcase

Jobs near you